పురావస్తు తవ్వకాల్లో కనిపించిన అరుదైన పాద ముద్రలు !

Telugu Lo Computer
0


ఉత్తర చైనీస్ ప్రావిన్స్ అయిన జాంగ్జియాకౌలో జూలై మొదటి వారంలో కొందరు పరిశోధకులు సుమారు 4,300 పాద ముద్రలను గుర్తించారు. సుమారు 9 వేల చదరపు మీటర్ల పరిమాణంతో ఉన్న ఈ పాదాల గుర్తులు జురాసిక్, క్రెటేషియస్ యుగాల మధ్య లేదా దాదాపు 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అయ్యి ఉండొచ్చునని వారు అంచనా వేస్తున్నారు. ఇవి పంజా ముద్రలతో కలిపి ఉండగా, వీటిని మొదటిసారిగా 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో గుర్తించారు. వాటిపై పరిశోధకులు లోతైన అధ్యయనం చేసి, ఆ పాదముద్రలు ఆధారంగా డైనోసార్‌ల పొడవు, బరువు, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వాటి నడక వేగాన్ని కూడా అంచనా వేస్తున్నారు. అంతరించిపోయిన ఈ జాతుల ఉనికికి సంబంధించిన పలు కీలక విషయాలు ఈ పాదముద్రల్లో కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 'ఈ పాదముద్రలు కేవలం డైనోసార్ల అలవాట్లు, ప్రవర్తనను ప్రతిబింబించడమే కాకుండా,  వాటితో వాతావరణానికి ఉన్న సంబంధాన్ని కూడా వివరిస్తున్నాయి' అని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన డైనోసార్ స్పెషలిస్ట్ జింగ్ లిడా చైనా చెప్పారు. కాగా, ఆ పాదముద్రలు నాలుగు విభిన్న డైనోసార్ జాతులకు చెందినవి. శిలాజాలలో ఒకటి ఇంకా గుర్తించబడని జాతికి చెందినదని నిపుణులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)