అస్సాం జిహాదీలకు అడ్డా ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 4 August 2022

అస్సాం జిహాదీలకు అడ్డా !


అస్సాంలో జిహాదీల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఒక రకంగా రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కొంత కాలం క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ఆరుగురు.. లాక్‭డౌన్ సమయాన్ని ఆసరా చేసుకుని జిహాదీ కార్యకలాపాలను ఉదృతం చేశారని, అయితే ఈ చొరబాటుదారుల్లో ఒకరిని తమ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ ఇస్లాంతో సంబంధాల ఏర్పరుచుకుని అస్సాంలోని ఐదు మాడ్యూళ్లలో జిహాదీ కార్యకలాపాలు సాగుతున్నాయని గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‭లో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కార్యకలాపాలు పెరగడానికి మదరసాలు కారణమని సీఎం అన్నారు. రాష్ట్రంలో 800 ప్రభుత్వ మదర్సాలు రద్దయ్యాయని, ఈ మదర్సాలపై, అక్కడ బోధిస్తున్న సబ్జెక్టులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఆయన కోరారు. ''మేము ఇప్పటికే 800 ప్రభుత్వ మదరసాలను రద్దు చేశాం. కానీ రాష్ట్రంలో చాలా కవామి మదరసాలు ఉన్నాయి. పౌరులు, తల్లిదండ్రులు వీటిపై ఓ కన్నేసి ఉంచాలి'' అని అన్నారు. కాగా, ఉపా చట్టం కింద తాజాగా ఒక మదరసాను జిల్లా అధికారి నేతృత్వంలో కూల్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ''ఆ మదరసాలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిని వివిధ స్కూళ్లకు పంపిస్తున్నాం. ఈ మదరసాను నడిపిస్తున్న ముఫ్తీ ముస్తఫా భోపాల్‭లోని ఇస్లామిక్ లా కాలేజీ నుంచి 2017లో డాక్టరేట్ తీసుకున్నారు. ఈయన కొద్ది రోజుల క్రితం అన్సరుల్‭తో సంబంధాలు ఉండడంతో అరెస్ట్ అయ్యారు'' అని అన్నారు.

No comments:

Post a Comment