ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం భానూరులోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటన్ చెరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. వీరంతా మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రేఖ బాసుదేవ్‌ల మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం రేఖ భర్తకు మతిస్తిమితం లేకపోవడంతో రోడ్లపై అడుక్కుంటూ జీవిస్తున్నాడు. దీంతో రేఖ తన మరిదితో వివాహేతర సంబంధం కొనసాగించిందని అనుమానిస్తున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయో.. కానీ, ఇరువురితో పాటు ఓ పాపను కూడా తమతో మృత్యు ఒడిలోకి తీసుకెళ్లిపోయారు. పటాన్చెరు డీఎస్పి భూమ్ రెడ్డిని న్యూస్ 18 వివరణ కోరగా.. ''వారు వలస కూలీలు బతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగించేవారు. రేఖ భర్త గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం కోల్పోవడంతో తన వరుసకు మరిది అయినటువంటి బాసుదేవ్‌ వివాహేతర సంబంధం పెట్టుకుని జీవనం కొనసాగిస్తూ ఉందని ప్రాథమిక విచారణలో తేలింది"అని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)