హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో ఐటీ దాడులు

Telugu Lo Computer
0


ఈ రోజు హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న ట్రై కలర్స్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ సంస్ధకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పది ప్రాంతాల్లో జరుగుతుండగా దేశంలోని ముంబై, పాట్నా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా పలు పట్టణాల్లోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ట్రై కలర్స్ సంస్ధ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తోంది. ఈ సోదాలలో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున నగదు గుర్తించినచట్లు సమాచారం. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తమిళ సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెజియన్‌కు సంబంధించి చెన్నై, మధురై లోని కార్యాలయాలు, ఇళ్లు, అతని వద్ద పైనాన్స్ తీసుకున్న నిర్మాతలు, హీరోలకు చెందిన సుమారు 40 చోట్ల నిన్న ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. అన్బు చెజియన్ కు చెందిన 20 ప్రాంతాల్లో ఈరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)