మలేసియాకు భారత్ యుద్ధ విమానాలు !

Telugu Lo Computer
0


యుద్ధ విమానాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడే భారత్ ఇప్పుడు స్వదేశీ విమానాల తయారీపై దృష్టి సారించింది. రక్షణ రంగంలో విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించి స్వదేశీ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రక్షణ రంగంలో ఉపయోగపడే అనేక ఆయుధాలు, సాంకేతికతలను దేశీయంగానే అభివృద్ధి చేస్తున్నారు. యుద్ధ విమానాలు తయారు చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత సంవత్సరం దాదాపు ఆరు బిలియన్ డాలర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థకు కేటాయించింది. దీంతో ప్రస్తుతం హెచ్ఏఎల్.. తేజాస్ పేరుతో యుద్ధ విమానాల్ని తయారు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. 83 విమానాల్ని తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 1983 తర్వాత ఈ తరహాలో విమానాలు తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇవి లైట్ కొంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు (ఎల్‌సీఏ). అయితే, వీటిపై ఇప్పుడు ఇతర దేశాలు దృష్టి పెట్టాయి. ఈ విమానాలు కొనేందుకు గతంలోనే మలేసియా ఆసక్తి చూపింది. దాదాపు 18 విమానాలు కావాలని రాయల్ మలేసియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. తాజాగా భారత్ సానుకూలంగా స్పందించింది. అన్ని అంశాలపై అంగీకారం కుదిరితే మలేసియాకు భారత్ 18 విమానాల్ని విక్రయిస్తుంది. మలేసియాతోపాటు ఈజిస్ట్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, అర్జెంటీనా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ కూడా ఈ విమానాలపై ఆసక్తి చూపుతున్నాయి. భారత్ సొంత యుద్ధ విమానాల తయారీపై దృష్టి పెట్టడంతో ఇతర దేశాలు కూడా ఈ విషయంలో సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. బ్రిటన్, రష్యా వంటి దేశాలు మన దేశంలోనే విమానాలు తయారు చేసి ఇస్తామని, దీనికి సంబంధించిన సాంకేతికతను కూడా అందిస్తామని ప్రకటించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)