జపాన్ ఎకనమిక్ జోన్‌లో పడిన డ్రాగన్ మిసైల్స్?

Telugu Lo Computer
0


తైవాన్ లక్ష్యంగా చైనా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు జపాన్ఎ క్స్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో పడినట్టు భావిస్తున్నామని జపాన్ రక్షణ మంత్రి నొబువ కిషి చేసిన ప్రకటన కలకలం రేపింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన నేపధ్యంలో తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాల నడుమ జపాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చైనా ప్రయోగించిన తొమ్మిది క్షిపణుల్లో ఐదు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ ఎకనమిక్ జోన్‌లో ల్యాండ్ అయ్యాయని నొబువ కిషి చెప్పుకొచ్చారు. జపాన్ తూర్పు ద్వీప ప్రాంతం ఒకినవ తైవాన్‌కు సమీపంలో ఉంటుంది. చైనా మిసైల్స్ తమ భూభాగంలో పడటంపై కిషి తీవ్రంగా ఆక్షేపించారు. దౌత్య వర్గాల ద్వారా చైనాకు జపాన్ తన నిరసనను తెలియపరిచిందని, ఇది తీవ్రమైన అంశమని, తమ జాతీయ భద్రత, పౌరుల భద్రతపై ప్రభావం చూపుతుందని కిషి పేర్కొన్నారు. కాగా, తైవాన్ సమీపంలో చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడంపై భగ్గుమంటున్న డ్రాగన్ ఇవాళ తైవాన్ తీరంలో బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)