ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ షురూ !

Telugu Lo Computer
0


ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, అశ్విని వైష్ణవ్, బీజేపీ చీఫ్ విప్ రాకేశ్ సింగ్, టీఆర్ఎస్ ఎంపీలు, వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు ఓట్లు వేశారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేశారు. ఈ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ (71), ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా (80) పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 10తో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త ఉప రాష్ట్రపతిని 788 మంది లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలోనూ ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు ప్రకటించాయి. జగదీప్ ధన్ కర్ కు టీడీపీ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ మార్గరెట్ అల్వాకి మద్దతు ప్రకటిస్తున్నట్లు నిన్న తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)