మొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా !

Telugu Lo Computer
0


ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి, 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కంబోజ్బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం పక్షాన యునైటెడ్ నేషన్స్ లో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా  రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుట్రెస్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రుచిరా మనందరం సాధించగలం అని అమ్మాయిలకు సూచన చేశారు.రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు. 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్ లో టాపర్ అయిన రుచిరాకు టీఎస్ తిరుమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. రుచిరా మొదట ప్యారిస్ లో రాయబారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రుచిరా ఢిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీగా పనిచేశారు. 1996 నుంచి 1999 వరకు మారిషస్ ఫస్ట్ సెక్రటరీగా సేవలందించారు.దక్షిణాఫ్రికాలో హైకమిషనరుగా పనిచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)