రాకెట్‌ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు దరఖాస్తు చేసుకొండి !

Telugu Lo Computer
0


అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపే అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కల్పిస్తోంది. ఈ వారాంతంలో తన తదుపరి స్పేస్‌ మిషన్‌ను ప్రయోగించనుంది. ఆ ప్రయోగాన్ని లాంచ్‌ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1/ఈఓఎస్‌-02 మిషన్‌ను 2022, ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ఇస్రో ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్‌, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పెస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుందని ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలంటూ ఓ లింక్‌ను షేర్‌ చేసింది. ఈ మిషన్‌ ద్వారా ఈఓఎస్‌-02 , ఆజాదిసాట్‌ అనే రెండు శాటిలైట్లను రాకెట్‌ మోసకెళ్లనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)