నిత్య పెళ్లికొడుకు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

నిత్య పెళ్లికొడుకు !


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి సతీష్ బాబు గత పదమూడేళ్లుగా యుఎస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం మొదట వైజాగ్ కు చెందిన శైలజను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి పన్నెండు ఏళ్ల వయస్సున్న కూతూరుంది. ఆ తర్వాత శైలజ బంధువైన లావణ్యతో పరిచయం పెంచుకొని అమెరికా వెళ్లాడు. అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మొదటి భార్య శైలజ హైదరాబాద్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శైలజ ఫిర్యాదుతో లావణ్యకు వదిలేసిన సతీష్ బాబు అలియాస్ శ్రీసత్యదేవ్ 2017 నర్సరావుపేట మండలం అన్నవరానికి చెందిన లక్ష్మీని వివాహ చేసుకున్నాడు. మూడు నెలల పాటు ఇండియాలో ఉండి ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లక్ష్మీతో ఒప్పందం చేసుకొని విడాకులు తీసుకున్నాడు. పాస్ పోర్ట్ తీసుకొని అమెరికా వెళ్లాడు. కొన్ని నెలల తర్వాత పాత గుంటూరుకు చెందిన దివ్యను నాలుగో వివాహం చేసుకున్నాడు. మూడు నెలలు ఉన్న తర్వాత చెప్పపెట్టకుండా అమెరికా వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రావటంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటికే పలు కేసులున్నట్లు పోలీసులు దివ్యకు చెప్పారు. గత ఏడాది మార్చి 26వ తేదిన కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ తల్లిదండ్రులు వీరభద్రరావు, విజయలక్ష్మీలను, వివాహాలు చేసుకోవటానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న చింతాడ బ్రహ్మనందరావులను స్టేషన్ కు పిలిపించి విచారించారు. సతీష్ బాబు అమెరికాలో ఉన్నట్లు చెప్పటంతో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. శ్యామలా నగర్ కు చెందిన ఐదో భార్య కూడా మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయవాడలో ఉన్న సతీష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు గుంటూరు దిశ పోలీసులు నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.

No comments:

Post a Comment