డిబేట్ మధ్యలో కుప్పకూలిన యాంకర్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

డిబేట్ మధ్యలో కుప్పకూలిన యాంకర్ !

 

యూకే ప్రధాని పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో పలు టీవీ ఛానెల్స్ నిర్వహించే డిబేట్లలో వీళ్లు మాట్లాడుతున్నారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన టాక్ టీవీ నిర్వహించిన డిబేట్లో కూడా వీళ్లు తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే ఈ మీటింగ్‌లో లిజ్ ట్రస్ మాట్లాడుతుండగా యాంకర్ కేట్ మెక్‌కాన్ ఉన్నట్లుండి కళ్లుతిరిగి కింద పడిపోయింది. ఇది చూసిన లిజ్ భయపడి పెద్దగా అరవగా.. రిషి సునాక్ వెంటనే పరుగెత్తుకెళ్లి కేట్‌కు ఏమైందని చూశాడు. ఆ తర్వాత లిజ్ కూడా వెళ్లి కేట్‌ను పరిశీలించింది. దీంతో ఈ డిబేట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ డిబేట్ నిర్వహించాల్సిన యాంకర్‌కు కరోనా సోకడంతో కేట్‌కు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ప్రస్తుతం కేట్ బాగానే ఉందని టాక్ టీవీ వెల్లడించగా.. సునాక్, ట్రస్ ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ఆమెను పరామర్శించారు.

No comments:

Post a Comment