విద్యార్థినిపై ఏడాదిగా ట్యూటర్ అఘాయిత్యం

Telugu Lo Computer
0


మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బాలిక (14) పై కన్నేసిన ట్యూటర్ ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో, ఫొటోలు చిత్రీకరించిన కామాంధుడు.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై సంవత్సరం నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు 9వ తరగతి చదువుతోంది. నిందితుడు ఆమెకు ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు రోజూ ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ సమయంలో వీడియోలు, చిత్రాలను కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని నిందితుడు బాలికను బెదిరించేవాడు. ఆమె భయంతో చాలాకాలంపాటు మౌనంగా ఉంది. అయితే.. వీడియోల గురించి బయటకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వేధింపులకు పాల్పడుతూ వీడియోలు, చిత్రాల తీసినట్లు బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది. నిందితుడు కొన్ని సందర్భాల్లో తన ఇంటికి పిలిపించుకుని ఆమెపై దారుణాకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చదువుకునే సమయంలో పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుందనే సాకుతో తరచూ గదికి తాళం వేసి, బాధితురాలిని హింసించే వాడని పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలి వీడియోలు, చిత్రాలను కుటుంబ సభ్యునికి ఒకరికి చూపించాడని.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)