ఇల్లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్‌ సంస్థ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 31 July 2022

ఇల్లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్‌ సంస్థ !


తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్స్‌ ఆగడాలు, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు ఆగడం మితిమీరిపోతున్నాయి.  చచ్చిపోతే చచ్చిపో, మాకేంటి?. చచ్చిపోయినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ యమకింకరుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎంతోమంది ఈ లోన్‌ యాప్స్‌, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులకు బలైపోయినా, వాళ్ల తీరు మాత్రం మారడం లేదు. మొన్నటికిమొన్న ఏపీలో రికవరీ ఏజెంట్స్‌ వేధింపులు భరించలేక ఓ యువతి సూసైడ్‌ చేసుకుంటే, ఇప్పుడు తెలంగాణలో ఏకంగా ఇంటినే స్వాధీనం చేసుకుంటున్నట్లు గోడలపై రాతలు రాశారు. ఆర్యోగం బాగాలేదు, కొద్దిరోజులు ఆగండి, మీ డబ్బు మొత్తం కట్టేస్తానంటూ వేడుకున్నా కనికరించలేదు రికవరీ ఏజెంట్లు.. చచ్చిపోతే చచ్చిపో, మాకేంటి?. చచ్చినా సరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులకు దిగాడు ఓ ఏజెంట్.. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌ గ్రామంలో లోన్‌ కట్టలేదని ఓ ఇంటిని స్వాధీనం చేసుకుంది వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ. దాంతో, తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు మోహన్‌ లబోదిబోమంటున్నాడు. వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ బరితెగించి, ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో బాధితుడు మోహన్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఊరిలో తమ పరువు పోయిందని, తమకిక చావే దిక్కు అంటూ వాపోతున్నారు. ప్రభుత్వం కల్పించుకుని వెరిటాస్‌ ఫైనాన్స్‌ సంస్థ వేధింపుల నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment