సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత చౌదరి (22) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ సాప్ట్ వేర్ సంస్థలో ఆమె పనిచేస్తున్నారు. గత మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు.  సోమవారం నుంచి విధుల్లో చేరాల్సి వుండగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరిన ఆమె జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపింది. దీంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక సాయంతో పోలీసులు చెరువులో గాలించగా మృతదేహాం బయటపడింది. శ్వేత ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)