అక్కడ చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు...!

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కాలేబాగ్ గ్రామం విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలో ఉంటుంది. ఈ గ్రామంలో పురుషులు గత కొంతకాలంగా వింత ఆచారం పాటిస్తున్నారు. ఆ నియమంలో భాగంగా చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఎందుకంటే కాలేబాగ్ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాలేబాగ్ గ్రామస్తులు ఏదో అరిష్టం సోకిందని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణాలు కోల్పోతున్నారని నమ్ముతున్నారు. బైక్ లపై నుంచి పడి గాయాలపాలైన వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడికి విషయం అంతా వివరించారు. దీనికి పరిహారంగా ఏదోకటి చేయండి అంటూ కోరారు. దీంతో సదరు పూజారి ''కాలేబాగ్ గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈ వ్రతం నియమాలు పాటించాలని ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎటువంటి వాహనాలు నడపకూడదని ఈ నియమాలు పాటించాలని తెలిపారు. దానికి గ్రామస్థులు కూడా సరేనన్నారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్‌ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)