బిడ్డను చంపడానికి అనుమతించం !

Telugu Lo Computer
0


ఓ అవివాహిత గర్భధారణ చేసి 23 వారాలు నిండాయి. అయితే గర్భధారణతో తనకు మానసిక వేధింపులు, అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బిడ్డను పెంచే పరిస్థితిలో తాను లేనని, బిడ్డను చంపేందుకు తనకు అనుమతి కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం బెంచ్ తుది తీర్పును వెలువర్చింది. బిడ్డను గర్భంలోనే చంపేందుకు అనుమతి ఇవ్వడం కుదరదని కోర్టు తీర్పునిచ్చింది. బిడ్డను ప్రసవించే వరకు మహిళను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని సూచించారు. డెలివరీ తర్వాత పుట్టిన పిల్లాడిని ఎవరికైనా దత్తత ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సాధారణంగా 36 వారాల్లో మహిళ ప్రసవిస్తుంది. మహిళకు ఇప్పుడు 23 వారాల గర్భధారణ సమయం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పిల్లాడిని గర్భంలో చంపడం కరెక్ట్ కాదని కోర్పు చెప్పుకొచ్చింది. బిడ్డ ప్రసవించే వరకు మహిళను సురక్షితమైన ప్రదేశంలో ఉంచి.. అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని పేర్కొంది. బిడ్డను ప్రసవించే వరకు మహిళ వివరాలు గోప్యంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)