మంకీపాక్స్‌ వ్యాక్సిన్ కోసం ఐసీఎమ్ఆర్ ఆహ్వానం

Telugu Lo Computer
0


మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ కోసం దేశంలోనే అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ప్రయత్నాలు ప్రారంభించింది. మంకీపాక్స్ వైరస్‌ను అడ్డుకునే వ్యాక్సిన్ తయారీకి కంపెనీలను ఆహ్వానించింది. అలాగే వ్యాధిని త్వరగా గుర్తించే విట్రో డయాగ్నస్టిక్ కిట్లు కూడా తయారు చేయాలని కంపెనీలను కోరింది. మంకీపాక్స్… వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది చాలావరకు ప్రాణాంతకం కాకపోయినా, తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాదాపు ఐదు రోజుల వరకు ఈ లక్షణాలుంటాయి. దాదాపు 76 దేశాల్లో విజృంభిస్తున్న మంకీపాక్స్ వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు మరణించినట్లు అంచనా. ప్రస్తుతం అర్హత కలిగిన కంపెనీల నుంచి ఐసీఎమ్ఆర్ వ్యాక్సిన్ తయారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వారానికి కనీసం లక్ష డోసుల వ్యాక్సిన్లైనా తయారు చేయగలిగే సామర్ధ్యం ఉండాలి. కోవిడ్ సందర్భంగా దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్ రూపొందించినట్లుగానే ఈ వ్యాక్సిన్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ కంపెనీలకు రాయితీ కూడా కల్పిస్తుంది. నిపుణుల సహకారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)