ఢిల్లీలో రోడ్డుపైనే మహిళ ప్రసవం !

Telugu Lo Computer
0


దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ గర్భిణిని హాస్పిటల్‌ లో చేర్చుకునేందుకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌ సిబ్బంది నిరాకరించారు. దీంతో రాత్రంతా ఆమె దవాఖాన బయటే ఉండిపోయింది. పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్‌ లోని  అత్యవరసర విభాగం వెలుపల రోడ్డుపై ప్రసవించింది. హాస్పిటల్‌ సిబ్బందిపై సదరు మహిళ బంధువులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల గర్భిణి సోమవారం ప్రసవం కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు వచ్చింది. అయితే, ఆమెకు హాస్పిటల్‌ సిబ్బంది అడ్మిషన్ నిరాకరించారు. దీంతో ఆమె సోమవారం రాత్రంతా హాస్పిటల్‌ బయటే ఉండిపోయింది. హాస్పిటల్‌ వెలుపల రోడ్డుపై పురిటినొప్పులు రావడంతో కొంతమంది మహిళలు చీర అడ్డుగా పెట్టగా, నర్సులు ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మహిళ, శిశువు ఇద్దరూ హాస్పిటల్‌లో చేరారని, క్షేమంగా ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి) మనోజ్ తెలిపారు. గైనకాలజీ విభాగానికి చెందిన సీనియర్ వైద్యుడు వారికి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై బాధిత వర్గంనుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, త్వరలోనే ప్రాథమిక నివేదికను అందజేస్తామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు బాధ్యులపై చర్య తీసుకున్నారా? లేదా? అనే నివేదికను జూలై 25లోగా అందజేయాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ సదరు హాస్పిటల్‌ కు నోటీసు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)