ముంబై ఫోటోగ్రాఫర్లకు సిద్ధార్థ వార్నింగ్ !

Telugu Lo Computer
0


తెలుగు, తమిళంలో హీరో సిద్ధార్థ కి మంచి మార్కెట్ ఉంది. తెలుగులో భాస్కర్ దర్శకత్వంలో నటించిన “బొమ్మరిల్లు”తో చాలామందిని సిద్ధార్థ ఆకట్టుకోవడం జరిగింది. లవర్ బాయ్ ఇమేజ్ కలిగిన సిద్ధార్థ.. పలు ప్రేమ కథ సినిమాలు తో పాటు డిఫరెంట్ సబ్జెక్టు కలిగిన సినిమాలు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా మాత్రం సిద్ధార్థ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తర్వాత మహాసముద్రం సినిమాతో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ నటించడం జరిగింది.తమిళంలో మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.  హీరోయిన్ ఆదితిరావు హైదరితో లవ్ లో పడినట్లు వార్తలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల హీరో సిద్ధార్థ ముంబైలో ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయ్యారు. తాజాగా ముంబైలో ఓ సెలూన్ నుండి హీరో సిద్ధార్థతో పాటు ఆదితిరావు హైదరి బయటకు రావడం జరిగింది. ఆ సమయంలో ముంబైలో ఫోటోగ్రాఫర్ వీరిద్దరిని ఫోటోలు తీశారు. దీంతో సిద్ధార్థ వెంటనే ఫైర్ అయ్యి, నేను ఇక్కడి వాడిని కాదు. వెళ్లి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళ ఫోటోలను తీసుకోండి. నెక్స్ట్ టైం ఇంత మర్యాదగా అసలు చెప్పను. అర్థమైందా అంటూ ముంబై ఫోటోగ్రాఫర్లకు హీరో సిద్ధార్థ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)