ఉక్రెయిన్‌ పౌరులకు రష్యా పౌరసత్వం !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ పౌరులకు రష్యా పౌరసత్వం పొందేలా వీలు కల్పించే ఉత్తర్వులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. తద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులకు దిగుతున్న రష్యా దాదాపు చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రాబల్యమున్న డాన్‌బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్‌పై మాస్కో సేనలు పట్టు సాధించాయి. ఇటీవలి కాలం వరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజ్జియా, ఖేర్సన్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చినవారికే సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి. తాజాగా ఉక్రెయిన్‌ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్‌ నిర్ణయించారు. దీనిపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. మొత్తంమీద ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు కూడా జారీ అయ్యాయి. ఉక్రెయిన్‌ జనాభాలో 18 శాతం మంది వీటిని పొందారు.ఇప్పటికే ఉక్రెయిన్ రెండు ప్రాంతాల్లో నివసించే వారితి పౌరసత్వాన్ని వేగవంతం చేశారు. అంతేకాదు దాదాపు రష్యన్‌ దళాల నియంత్రణలో ఉన్న ఖేర్సన్‌, జపోరిజ్జియా వంటి ఆగ్నేయా ప్రాంతాల్లో ఈ విధానాన్ని వేగవంతం చేశారు. ఇలానే 2019లో తూర్పు ఉక్రెయిన్‌ నుంచి విడిపోయిన మాస్కో అనుకూల వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుగాన్క్స్ వంటి ప్రాంతాల్లోని నివాసితులకు ఇలాంటి డిక్రీని ఆదేశించి తనలోకి కలిపేసుకుంది. వాస్తవానికి ఈ డిక్రీ ద్వారా సరళీకృత విధానంలో రష్యా పౌరసత్వాన్ని పోందేలా దరఖాస్తు చేసుకునే హక్కుని ఉక్రెయిన్‌ పౌరులకు రష్యా అందిస్తోంది. ఈ డిక్రీతో పౌరసత్వం పొందిన వారు రష్యాలో భాగమవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)