ఆక్యుపెన్సీ రేటు లో స్పైస్‌జెట్ ముందంజ !

Telugu Lo Computer
0


సాంకేతిక లోపాల పరంగా ఇటీవల ఆటుపోట్లు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ ఆక్యుపెన్సీ రేటు లో మాత్రం ఇతర ఎయిర్‌లైన్స్ కంటే ముందంజలో ఉంది. జూలై 1వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేటు 80 శాతానికి పైనే ఉందని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. గత 24 రోజుల్లో తొమ్మిది సార్లు స్పైస్ జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ''ప్రయాణికులు మాపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని స్పైస్ జెట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్ అనడానికి ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (PLF) తాజా నిదర్శనమని చెప్పారు. జూలై 1 నుంచి 10వ తేదీ మధ్య ఇతర ఎయిర్‌లైన్స్‌ల ఆక్యుపెన్సీ రేటు 70 నుంచి 80 శాతం ఉందని ఏవియేషన్ వర్గాలు తెలిపాయి. స్పైస్ జెట్ వివరాల ప్రకారం, జూలై 1న స్పెస్ జెట్ ఆక్యుపెన్సీ రేటు 83.1గా ఉంది. 2వ తేదీన 88.2 శాతం, 3న 90.1 శాతం, 4న 86.5 శాతం, 5న 86.2 శాతం, 6న 85.8 శాతం, 7న 84.1 శాతం, 8న 84.2 శాతం, 9న 86.6 శాతం, 10న 85.1 శాతం, 11న 81.3 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)