గురు రియల్టీ అసోసియేట్స్‌ వింత మోసం !

Telugu Lo Computer
0


తమిళనాడులోని చెన్నైలో ఇంటిని అద్దెకు తీసుకుని.. ఆ తర్వాత లక్షలకు లీజుకిచ్చిన ఘటనలో రూ.20 కోట్లకు పైగా మోసం చేసిన ముఠాపై 154 మంది బాధితులు.. డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. చెన్నై పక్కనే ఉన్న కోవిలంబాక్కంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీ రోడ్, భూపతినగర్, పల్లవరం-దురైపాక్కం రేడియల్ రోడ్‌లో చోళై ముత్తురాజా గురు రియల్టీ అసోసియేట్స్‌ను నడుపుతున్నాడు. కంపెనీ కొత్తగా నిర్మించే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేది. ఇంటి అద్దెను నెలవారీగా చెల్లిస్తామని ఇంటి యజమానులతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ఆ ఇళ్లనే లీజుకు ఇస్తామని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్  ఓఎలెక్స్ ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రకటన చూసి వందలాది మంది రూ.4 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించి ఇళ్లను లీజుకు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం ఆ ఇంటి యజమానులకు తెలియకుండా వీరితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే.. తమ ఇళ్లకు గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఇంటిలో ఉన్న వారిని కోరారు. మేం లక్షలు చెల్లించి ఇంటిని లీజుకు తీసుకున్నామని ఎందుకు ఖాళీ చేయాలని ప్రశ్నించారు. ఆ వెంటనే ఇంటి యజమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అసలు విషయం లీజుకు తీసుకున్నవారికి చెప్పారు. తాము చోళై ముత్తురాజా గురు రియల్టీ అసోసియేట్స్‌కు అద్దెకు ఇచ్చామని తెలిపారు. దీంతో తాము మోసపోయామని ఇరు వర్గాలు గుర్తించాయి. కొంత మొత్తం చెల్లించి ఇంటిని అద్దెకు ఇస్తున్నట్లుగా యజమానితో అగ్రిమెంట్ చేసుకున్న సోలాయి ముత్తురాజా.మరో పక్క ఇల్లు ఖాళీగా ఉందని ప్రచారం చేస్తూ ఇంటికొచ్చిన వారిని టార్గెట్ చేసి.. ఆ తర్వాత లీజుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు లక్షల్లో డబ్బులు తీసుకుని ఆ ఇళ్లను లీజుకు అప్పగించేవారు. ఇలా.. మోసపోయిన వారి సంఖ్య 150కు పైనే ఉంది. మోసపోయిన 154 మంది తమ డబ్బును తిరిగి ఇప్పించాలని చెన్నైలోని పనయూర్ ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని పల్లికారాణి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 154 మందిని కుట్ర పన్ని మోసం చేసిన గురు రియల్టీ అసోసియేట్స్ యజమాని చోళై ముత్తురాజా, అతని సహాయకుడు అమలి, రమేష్, సంతోష్, కృష్ణ, శివ, మంజు, శరవణన్, రేణుక, మహాలక్ష్మి పరారీలో ఉన్నారు. చోళై ముత్తురాజా 20 కోట్లకు పైగా మోసపోయాడని.. అతనిలో చేతిలో ఇంకా చాలా మంది మోసపోయారని..మోసపోయిన డబ్బు విలువ మరింత పెరిగే అవకాశం ఉందని బాధితులు తెలిపారు 

Post a Comment

0Comments

Post a Comment (0)