క్లాస్ రూంలో విద్యార్ధిని, విద్యార్ధుల మధ్య పరదా !

Telugu Lo Computer
0


కేరళలోని త్రిసూర్ లోని ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే ఇస్లామిక్ సంస్థ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అబ్బాయిలు, అమ్మాయిలు హాజరయ్యారు. అలా ఓ వైపు అమ్మాయి, మరోవైపు అబ్బాయిలు కూర్చుకున్నారు. వారి మధ్య ఓ తెర ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహించారు. దీంట్లో ఎల్జీబీటీక్యూఐఏ వర్గం (గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్) అనే అంశంపై తరగతులు నిర్వహించారు.  దీనికి సంబంధించిన ఫొటోను సదరు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు చెందిన సభ్యుడు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది వివాదంగా మారింది. దీన్ని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), వామపక్ష విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల మధ్య తెర ఎందుకని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం దారుణమని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విమర్శలు వస్తుండటంతో సదరు ఇస్లామిక్ సంస్థ ఏ మాత్రం తగ్గటంలేదు. ‘జెండర్ రాజకీయాల’ గురించి చర్చించడానికి మెడికల్ కాలేజీలో సమావేశం ఏర్పాటు చేశామని చెబుతున్న ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ తమ చర్యను సమర్థించుకుంటోంది. మేం చేసిందాంట్లో తప్పేమిటి? అని ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంపై తాము పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత రంగంలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్ యూ) అధ్యక్షుడు కేఎం అభిజిత్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)