ప్రధాన మంత్రి స్వనిధి యోజన

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం లోన్స్ అందిస్తోంది. దీని కింద వారికి రూ.10 వేల నుంచి రూ.25 వేల రుణం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం రుణంపై సబ్సిడీని కూడా అందిస్తోంది. రుణం చెల్లించిన తర్వాత రెండోసారి రెట్టింపు మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం కూడా రుణాలపై గ్యారెంటీని ప్రస్తుత 15% నుంచి 25%కి పెంచింది. ఈ పథకాన్ని గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తుంది. ప్రతి రుణగ్రహీత 7% వడ్డీ రాయితీకి అర్హులు. ఎవరైనా ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద మొదటిసారిగా 10 వేల రూపాయలు లోన్ తీసుకున్నారని అనుకుందాం. అతను దానిని సకాలంలో చెల్లించినట్లయితే.. వారికి ఈ పథకం కింద రెండోసారి రూ.20 వేల రుణం లభిస్తుంది. అదేవిధంగా మూడోసారి రూ.50 వేల రుణం పొందేందుకు అర్హత సాధిస్తారు. విశేషమేమిటంటే ఈ పథకం కింద లోన్ తీసుకోవడానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. లోన్ మొత్తం మూడు విడతలుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ప్రధాన మంత్రి స్వనిధి యోజన  కింద తీసుకున్న రుణ మొత్తాన్ని ఒక సంవత్సరం కాలవ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు ప్రతి నెలా వాయిదాల్లో లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది. ప్రధాన మంత్రి స్వనిధి యోజన  ప్రయోజనం పొందడానికి.. దరఖాస్తుదారు ఆధార్ కార్డును తప్పక కలిగి ఉండాలి. ప్రధానమంత్రి స్వనిధి యోజన రుణం తీసుకోవడానికి, ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా బ్యాంకులో ప్రధానమంత్రి స్వనిధి యోజన లోన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీరు ఫారమ్‌తో ఆధార్ కార్డ్ ఫోటోకాపీని జతచేయాలి. దీని తర్వాత.. మీ దరఖాస్తు ఆమోదించబడినట్లయితే లోన్ మొదటి విడత సొమ్ము మీ ఖాతాలో జమ చేయబడుతుంది. వీధి వ్యాపారులకు క్యాష్ బ్యాక్ సహా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం ఈ పథకం బడ్జెట్‌ను పెంచింది. ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ పథకం కింద 25 ఏప్రిల్ 2022 వరకు 31.9 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. ఇది కాకుండా 29.6 లక్షల రుణాలకు గాను రూ.2,931 కోట్లు విడుదలయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)