ఆంధ్రప్రదేశ్‌ నుంచి బియ్యం, వడ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తుంది !

Telugu Lo Computer
0

 


ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్‌ నుంచి బియ్యం, వడ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తుందని పీయూష్ గోయల్  స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీకేఏవై 6వ దశ కింద ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ దశ కింద 8.04 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించాం. ఏ రాష్ట్రమైనా ఈ కేంద్ర పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ స్పష్టం చేసారు. ఇదే అంశం పైన పార్లమెంట్ లో టీడీపీ సభ్యుడు కేశినేని అడిగిన ప్రశ్నకు సభలో మంత్రి పీయూష్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద ఏపీకి గత అయిదు విడతల్లో 23,75,496 మెట్రిక్‌ టన్నులు అందించామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఇప్పటి దాకా ఉచిత బియ్యం పంపిణీ చేయలని విషయాన్ని ప్రశ్నించామని.. తమ వద్ద తగిన నిల్వలు ఉన్నాయని చెబుతూ.. ప్రత్యేకంగా సమస్యలను చెబుతూ ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు పీయూష్ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలైన తరువాత ఒకే రోజు శ్రీలంకలో సంక్షోభం పైన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఆర్దిక వ్యవస్థ గురించి.. పోలవరం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ.. ఇప్పుడు బియ్యం విషయంలోనూ కేంద్రం ఒక విధంగా ఏపీకి హెచ్చరిక ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు కారణమవుతోంది. తెలంగాణలో ఇదే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా రాజకీయ యుద్దం సాగింది. ఏపీలోని పరిస్థితుల పైన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీని పైన ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కౌంటర్ ఇవ్వటం ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)