భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం జీరో ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం జీరో !


కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని అస్థిర పరిచాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితులు దారుణం దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ దేశాాలను ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక మాంద్యంపై బ్లూమ్ బర్గ్ ఓ నివేదికను వెల్లడించింది. ప్రపంచంలో రానున్నటువంటి ఆర్థికమాంద్యం గురించి బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వీటిలో ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాల గురించి ప్రస్తావించారు. ఈ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. భారత్ తో ఆర్థికమాంద్యం వచ్చే పరిస్థితి దాదాపుగా 'జీరో' అని.. ఆర్ధికమాంద్యం వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. ప్రపంచంలో శ్రీలంకలో 85 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసియా దేశాల్లో 20-25 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. యూరోపియన్ దేశాల్లో 50-55 శాతం వరకు ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. అమెరికాలో ఆర్థికమాంద్యం 40 శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండోనేషియాలో 3 శాతం, ఫిలిప్పీన్స్ 8 శాతం మాత్రమే ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. శ్రీలంకలో పాటు న్యూజీలాండ్ లో 33 శాతం రిసిషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో 25 శాతం వరకు ఛాన్సులు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. చైనా, పాకిస్తాన్ దేశాల్లో 20 శాతం అవకాశాలు ఉన్నట్లుగా బ్లూమ్ బర్గ్ నివేదిక అంచానా వేసింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఆర్థికమాంద్యంతో భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో వ్యవసాయ రంగం ముందంజలో ఉందని.. దేశంలో ఆహార కొరత, ఆహార ద్రవ్యోల్బనం లేదని ఆర్థిక నిపుణులు అంచానా వేస్తున్నారు. మాన్యుఫాక్చర్, సర్వీసెస్ సెక్టార్లు కూడా ఇండియాలో బలంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. బ్లూమ్ బర్గ్ తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) భారత దేశంలో 7.3 శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని వెల్లడించింది.

No comments:

Post a Comment