దేశమంతటా విస్తరించిన నైరుతి రుతు పవనాలు

Telugu Lo Computer
0


దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. గతనెల 1న కేరళను తాకిన రుతుపవనాలు..వేగంగా కదుతూ దేశమంతటా విస్తరించాయి. రుతు పవనాల ప్రభావంతో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. వీటికి తోడు నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. దీంతో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)