రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 July 2022

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం !


ద్రౌపది ముర్ము నూతన రాష్ట్రపతిగా  పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణస్వీకారం చేయించారు.15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు. నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం అన్నారు. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే అంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆమె గుర్తు చేసుకున్నారు. మా గ్రామంలో బాలికలు స్కూల్ కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం అని తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పేదలు కూడా తమ కలల్ని నిజం చేసుకోవచ్చు అని తనతో రుజువైందన్నారు. మీ నమ్మకం, మద్దతు బాధ్యతల్ని నిర్వర్తించేందుకు తనకు శక్తినిస్తుందన్నారు. భారత్‌ స్వాతంత్య్రం సాధించిన తర్వాత పుట్టిన తొలి రాష్ట్రపతిని తానే అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆశయాలకు తగినట్లు అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు. రాష్ట్రపతి పదవిని చేరుకోవడం తన వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని..ఇది భారత్‌లో ఉన్న ప్రతి పేదవాడి అచీవ్‌మెంట్ అని..తాను రాష్ట్రపతిగా నామినేట్ అవ్వడం అంటే, దేశంలో పేదలు కలలు కనవచ్చు అని అన్నారు. పేదలు తమకలల్ని నిజం చేసుకోవచ్చు అని రుజువైందన్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడినవాళ్లు, గిరిజనులు, తనను ఆశాకిరణంగా చూడవచ్చన్నారు. తన నామినేషన్ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కోట్లాది మహిళల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. జులై 26న కార్గిల్ దివస్ ను జరుపుకుంటున్నాం అని..కార్గిల్ విజయ్ దివస్ భారత్ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకి చేరారు. అలాగే, అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, రాష్ట్రపతి పదవిని అలంకరించిన అతి పిన్న వయసు వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం.

No comments:

Post a Comment