చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య !


వాస్తు శాస్త్ర నిపుణుడిగా మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక హుబ్బళిలోని ఓ హోటల్ రిసెప్షన్​లో ఆగంతుకులు ఆయన్ను కిరాతకంగా పలు మార్లు కత్తితో పొడిచి చంపారు. హత్య ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొందరు ఆగంతకులు చంద్రశేఖర్​ ఉంటున్న హోటల్​కు వచ్చి లాబీలోకి రావాలని పిలిచారు. చంద్రశేఖర్ రాగానే ఓ వ్యక్తి నమస్కారం పెట్టి వెంటనే కత్తితో పొడవడం ప్రారంభించాడు. తీవ్ర గాయాలు కావడం వల్ల చంద్రశేఖర్​ను ఆస్పత్రికి తరలించేసరికే చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే హుబ్బళి పోలీస్ కమిషనర్ లాభూ రామ్​ ఘటనా స్థలానికి వెళ్లి, స్వయంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

No comments:

Post a Comment