నాతో కలిస్తే నవరత్నాలకు డబ్బులు నేనిస్తా !

Telugu Lo Computer
0


విజయవాడ  మీట్ ది ప్రెస్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఆయన అన్నారు. నాతో కలిస్తే అన్ని పథకాలకు డబ్బులిస్తానంటూ సీఎం జగన్ కు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. నాతో కలవాలి లేదా నా పార్టీలో చేరితే అన్నింటికి పరిష్కారం చూపిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తల్లిదండ్రులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారన్న పాల్.. జగన్ మాత్రం తనను కలవడానికి ఇష్టపడటం లేదన్నారు. సీక్రెట్ గా అయినా ఆహ్వానిస్తే వెళ్లి కలుస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలన్న పాల్.. పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన జగన్ దగ్గర నవరత్నాలు అమలు చేయడానికి డబ్బుల్లేవన్నారు. తనతో కలిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. ఏపీలో పలుచోట్ల ప్రజాశాంతి పార్టీ సమావేశాలు జరుగుతున్నాయని, నాకు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. జగన్ ను చంద్రబాబు ఏడిపించారని, అందుకే ఇప్పుడు అసెంబ్లీలో ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ తనకు శత్రువులు కాదని పాల్ చెప్పారు. అయితే పొత్తుల విషయంలో పవన్ వైఖరి మార్చుకోవాలని, ఈ అన్నయ్యతో కలిస్తే అంతా మంచే జరుగుతుందంటూ జనసేనానికి ఆఫర్ ఇచ్చారు. నేనంటే పవన్ కు గౌరవమన్న పాల్, తమ్ముడు ముందుకు వస్తే కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా శాంతిపార్టీ లో చేరేందుకు ఐఎయస్, ఐపియస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఇద దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్న పాల్.. ప్రతిపక్షాలపై మోదీ ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు వద్దని.. బ్యాలెట్ విధాన్ని తీసుకురావాలని.. దీనిపై న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఏపీకి ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉందని.. ఈ నేపథ్యంలో రూపాయి పుట్టే పరిస్థితి లేదన్నారు. అలాగే తెలంగాణలో చేసిన ఐదు లక్షల కోట్ల అప్పు ఏం చేసారో తెలియదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. దేశం మరో శ్రీలంకగా మారడం ఖాయమన్నారు. ఆరు నెలల్లోనే మన దేశం నాశనం కాబోతుందని జోస్యం చెప్పారు. ఏపీ నాశనం కావడానికి నలుగురు ప్రధాన కారణమన్న పాల్.. అప్పట్లో చంద్రబాబు తన మాటలు పట్టింకోలదన్నారు. ఆయన ప్రధాని కావడాని..., కొడుకు సీఎం కావడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఆరోపించారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని.., మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదని మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)