ప్రారంభమైన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 July 2022

ప్రారంభమైన కామన్‌వెల్త్‌ గేమ్స్‌


బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్‌ అలెగ్జాండర్‌ స్టేడియంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.  భారత అథ్లెట్ల బృందానికి షట్లర్ పీవీ సింధు, హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్‌ ప్రాతినిధ్యం వహించారు. హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి సింధు ఫ్లాగ్‌ బేరర్‌గా ముందు నడవగా.. మిగతా ప్లేయర్లందరూ ఆమెను అనుసరించారు. ఆగస్టు 8వరకు జరగనున్న ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాల నుంచి 4వేల 500మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్‌ నుంచి 215మంది ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సన్నద్దమయ్యారు. రెండు దశాబ్దాలలో యూకే మూడోసారి కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిస్తోంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత మరో భారీస్థాయి క్రీడోత్సవానికి యూకే సిద్ధమైంది. ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళలకు పోటీలు నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ క్రీడల పోటీ ఇదే. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అమ్మాయిలకు 136 స్వర్ణాలు అందనుండగా.. పురుషులకు ఆ సంఖ్య 134గా ఉంది. మిక్స్‌డ్‌ ఈవెంట్లలో మరో పది బంగారు పతకాలున్నాయి. ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌ ఉండడంతో భారతీయ మహిళా క్రికెట్‌ టీమ్‌పై ఆశలు పెరిగాయి. 215 మందితో టీమిండియా బర్మింగ్‌హాంకు వెళ్లింది. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, హాకీ, జూడో, స్క్వాష్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, ట్రయథ్లాన్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో భారత్‌ పోటీ పడనుంది. ఈసారి ఈవెంట్స్‌లో షూటింగ్‌ లేకపోవడం భారత్‌కు మైనస్‌గా మారింది.

No comments:

Post a Comment