మొక్కజొన్న పొత్తు - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


మొక్కజొన్నకండి తిన్న వెంటనే నీటిని తాగటం మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు. వర్షాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్నను తాజాగా తీసుకోవాలి. ఉడికించి కూడా తీసుకోవచ్చు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తిన్న వెంటనే నీటిని తాగటం వలన జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనిలో స్టార్చ్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి మొక్కజొన్న తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ మరియు తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. మొక్కజొన్న తిన్న పావుగంట తర్వాత నీటిని తాగవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉంచితే హానికరమైన బ్యాక్టీరియా వృద్ధికి దారి తీస్తుంది. దాంతో కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. మొక్కజొన్నలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతుంది.  స్టార్చ్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. మొక్కజొన్న తీసుకోవటం వలన ప్రయోజనాల విషయానికి వస్తే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. మొక్కజొన్నలోని విటమిన్ సి మరియు కెరోటినాయిడ్స్ మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)