నిండుకుండలా తెలంగాణ జలాశయాలు

Telugu Lo Computer
0


ఎగువనుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుకున్నది. జూరాల నుంచి లక్షా 45 వేల 940 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి లక్షా 15 వేల 792 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల 61 వేల 732 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 836.40 అడుగుల వద్ద నీరు ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఊహించని స్థాయిలో వస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులకు గతంలో ఎప్పుడు లేనంతగా వరద వస్తోంది. భూపాపల్లి జిల్లాలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి ఊహించని రివర్స్ వరద వచ్చింది. లక్ష్మీ బ్యారేజీ కి ఇరు వైపులా గోదావరి ఉదృత్తంగా ప్రవహిస్తోంది. ఇంద్రావతి నది ప్రవాహంతో మేడగడ్డ దగ్గర గోదావరి నీళ్లు రివర్స్ అవుతున్నాయి. కిందకు వెళ్ళలేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తోంది వరద. దీంతో లక్ష్మీ బ్యారేజీ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ ను నలువైపులా నుంచి వరద వెళ్తోంది. ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్‌ ప్రాజెక్టుల నుంచి లక్షా 87 వేల 460 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో చేరుతోంది. 36 గేట్ల ద్వారా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మూడు వేలు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా గోదావరిలోకి మూడు వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 13 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వుండగా.. 24 గంటల్లో అది 5 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం తగ్గింది. కడెం ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రానికి ఇన్ ఫ్లో కేవలం 22 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామసాగర్ కు ఇన్‌ ఫ్లో రెండు లక్షలకు తగ్గింది. మిడ్‌ మానేరు. లోయర్‌ మానేరు నిండుకుండల్లా మారాయి. నిజాంసాగర్‌లోకి 25,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఐదు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. సింగీతం ప్రాజెక్టు 416.50 పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉంది. జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టు 458.00 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. ఎగువ భాగం నుంచి 4480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రెండు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి 15,955 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 529.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 522.166 టీఎంసీలనీరు నిల్వ ఉంది. పోచారం ప్రాజెక్టులోకి లింగంపేట్‌, గుండారం, గాంధారి తదితర ప్రాంతాల నుంచి 12,341 క్యూసెక్కుల వదర వచ్చి చేరుతున్నది. ప్రధాన కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)