నా భర్త నాకు కావాలి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 3 July 2022

నా భర్త నాకు కావాలి


తెలంగాణలోని  ఆదిలాబాద్ కు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే దళిత యువతి లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన మెట్టుపల్లి శ్రీధర్ ని  ప్రేమించి  2021 నవంబర్ 21న ఓ గుడిలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకు భర్త ముఖం చాటేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సిలింగ్ చేసి వారి కాపురం చక్కదిద్దారు. ఈమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. మూడు నెలల కిందట ఇంట్లో చెప్పా పెట్టకుండా భర్త వెళ్లిపోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం ఎదుట దీక్షకు పూనుకుని బైఠాయించింది. తన భర్త తనకు కావాలని, న్యాయం చేసేంతవరకు దీక్ష విరమించేది లేదని పేర్కొంది.

No comments:

Post a Comment