సిద్ధరామయ్య వైపే అధిష్ఠానం మొగ్గు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 July 2022

సిద్ధరామయ్య వైపే అధిష్ఠానం మొగ్గు


బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి  మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్టానం శక్తిని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్వీర్యమైందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజల డిమాండ్‌లు తీర్చే శక్తి ఆ పార్టీ నేతలకు లేకుండా పోయిందన్నారు. రాహుల్‌గాంధీ సిద్దరామోత్సవలో పాల్గొనేందుకు వస్తున్నారంటే పార్టీ ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కాంగ్రెస్‌ నిర్వీర్యం దిశగా వెళుతోందన్నారు. రాష్ట్ర పార్టీకు అధ్యక్షులుగా డీకే శివకుమార్‌ రబ్బర్‌స్టాం్‌పగా మిగిలారని ఎద్దేవా చేశారు. సిద్దరామయ్యను చూస్తే కాంగ్రెస్‌ ఉలికి పడుతోందన్నారు. ఆయనను వ్యతిరేకిస్తే భవిష్యత్‌ ఏమి కానుందో అనే భయం వారికి వెంటాడుతోందన్నారు. సిద్దరామయ్య ఒకప్పటి దేవరాజు అరసును మించిన నాయకత్వ లక్షణాలు కలిగినవారని పరమేశ్వర్‌ వ్యాఖ్యానించారన్నారు. మూతి కాలిన పిల్లి తరహాలో సిద్దరామయ్యను పొగడక పోతే ఏం జరుగుతుందో అనే ఆలోచనలో పడ్డారన్నారు. ఓ వైపు సిద్దరామోత్సవ, మరో వైపు శివకుమారోత్సవలో పేరుతో అనేకమైన ఉత్సవాలకు పార్టీ సిద్దమవుతోందన్నారు. దేశచరిత్రలో ఉత్సవాలు పరిశీలిస్తే అది కేవలం గాంధీ కుటుంబాలకు మాత్రమే పరిమితంగా ఉండేదన్నారు. రాజీవ్‌గాంధీ కంటే ముందు అనేలా వ్యవహరించినందుకు వీపీ సింగ్‌కు చిత్రహింసలు చేశారని అదే పరిస్థితి రాష్ట్రంలో సిద్దరామోత్సవ ద్వారా నాయకులలో భయం వెంటాడుతోందని అందుకే అందరూ మద్దతిచ్చేందుకు సిద్దమయ్యారన్నారు.

No comments:

Post a Comment