5జీలో చార్జీల మోత ?

Telugu Lo Computer
0


5జీ సేవల కోసం మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు మరింతగా ఖర్చు చేయాల్సి రావచ్చు.ఇప్పుడున్న 4జీ కంటే 5జీలో ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా టెలికం సంస్థలు దాదాపు 10-20 శాతం అధికంగా 5జీ ప్లాన్ల ధరల్ని నిర్ణయించవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 5జీ సేవలు ప్రీమియం శ్రేణి రేడియో తరంగాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత 4జీ కంటే 5జీలో ఇంటర్నెట్‌ వేగం కూడా 10 రెట్లు అధికంగా రానుంది. ఫలితంగా దీనికి తగ్గట్టుగానే చార్జీల మోత మోగుతుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2జీ, 3జీల కంటే 4జీ ప్లాన్ల ధరల్ని టెలికం సంస్థలు ఎక్కువగా నిర్ణయించాయి. అలాగే 4జీ కంటే 5జీ ప్లాన్లూ ప్రియంగానే ఉండొచ్చని నొమురా రిసెర్చ్‌ అంటున్నది. 5జీలో ఒక్కో వినియోగదారుని సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) టెలికం సంస్థలు పెంచాలని కూడా భావిస్తుండటం.. ప్లాన్ల రేట్లను పరుగులు పెట్టించవచ్చని పేర్కొన్నది. ఈ నెల 26 నుంచి 5జీ స్పెక్ట్రం వేలం మొదలు కానున్నది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగాహెట్జ్‌ల స్పెక్ట్రంను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలతో పాటు అదానీ గ్రూప్‌ కూడా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)