కడెం ప్రాజెక్టుకు 500 ఏళ్లలో ఇదే మొదటిసారి !

Telugu Lo Computer
0


కడెం ప్రాజెక్టుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను, మీడియాను రాష్ట్ర నీటి శాఖ అధికారులు కోరారు. భారీ వర్షాలు వరదల కారణంగా కడెం ప్రాజెక్టు తెగిపోయిందని కొన్ని వార్తా చానెళ్లలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పుకార్లను సృష్టించవద్దని తెలిపారు. డ్యాం తెగిపోయినట్టు ప్రసారం అవుతున్న వీడియోలు వాస్తవం కాదన్నారు. డ్యాం కొట్టుకుపోయినట్టు ఎటువంటి సమాచారం కడెం ప్రాజెక్టు అధికారుల నుంచి రాలేదన్నారు. అయితే పరిస్థితి కొంత అందోళన కరంగానే ఉందన్నారు. 500 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా కడెం నది పరివాహకంగా ఇంత భారీ వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మించాక 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం భావ్యం కాదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాత్రమే ప్రజలకు వార్తలు అందించడం న్యాయమన్నారు. లేనిపోని భయాందోళనలకు ప్రజలను గురి చేయరాదని నీటిపారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)