35 నిమిషాల్లో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఊపిరితిత్తుల తరలింపు

Telugu Lo Computer
0


ముంబయికి చెందిన చంద్రకాంత్‌ గోవింద్‌ నాచరే (58) రక్తపోటు కారణంగా ఇంట్లో పడిపోయారు. కుటుంబీకులు స్థానికంగా ఉన్న 'శ్రీహెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌' ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిది రోజుల పాటు వెంటిలేటర్‌పై వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. అవయవ దానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగి రక్త నమూనాలు సరిపోవడంతోసమాచారం అందించారు. ముంబయి నుంచి నేరుగా గురువారం శంషాబాద్‌ విమానాశ్రయానికి ఊపిరితిత్తులు చేరుకోగా, గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.25 నిమిషాలకు అంబులెన్స్‌లో ఎస్కార్ట్‌ వాహనం సాయంతో బయలుదేరి కిమ్స్‌ ఆసుపత్రికి 6.గంటలకు చేర్చారు. 36.8.కి.మీ. దూరాన్ని 35 నిమిషాల్లో అంబులెన్స్‌ చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)