మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే

Telugu Lo Computer
0


మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ 100 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తిరగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షిండే ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ''మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు కాదు'' అని సంజయ్ రౌత్ అన్నారు. షిండే ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం షిండే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ కూటమి 200 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ అది జరగకపోతే తాను రాజకీయాల్ని వదిలేసి, వ్యవసాయం చేసుకుంటానని సవాల్ విసిరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)