రూ.100 లాటరీ టికెట్ కు రూ.10 లక్షల జాక్​పాట్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 July 2022

రూ.100 లాటరీ టికెట్ కు రూ.10 లక్షల జాక్​పాట్ !


పంజాబ్​లోని అమృత్​సర్​కు చెందిన జమాల్​ సింగ్ రోడ్డు మీద చిన్న తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆదివారం సెలవని అతడి కుమార్తె హర్​సిమ్రన్​​ కౌర్ తండ్రికి సాయం చేయడానికి తోపుడు బండి దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి దుకాణానికి వచ్చాడు. టికెట్ కేవలం రూ.100 అని, ఒకటి కొనుగోలు చేయమని అతడు చెప్పాడు. అయితే జమాల్​ సింగ్ మాత్రం​ అందుకు నిరాకరించాడు. కానీ అతడి కుమార్తె హర్​సిమ్రన్​ కౌర్ తన తండ్రిని ​ఒప్పించి మరీ కొనుగోలు చేసింది. బుధవారం జరిగిన లాటరీ డ్రాలో ఆ బాలిక రూ.10 లక్షలు గెలుచుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే జమాల్​ సింగ్​ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని తన తండ్రి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి వినియోగిస్తామని హర్​సిమ్రన్​ కౌర్​ తెలిపింది. దాంతో పాటు తన చెల్లెళ్ల చదువు కోసం వెచ్చిస్తామని చెప్పింది.

No comments:

Post a Comment