కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడిన తల్లి ఏనుగు !

Telugu Lo Computer
0


ఏనుగు మంద తిరిగి ఇంటికి వెళుతున్నాయి. అయితే మధ్యలో ఉన్న వాగు దాటాల్సి వచ్చింది. అలా ఒక్కొటి దాటుతున్నాయి. అయితే పిల్ల ఏనుగు కూడా దాటే ప్రయత్నం చేసింది. కానీ అదీ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. గమనించిన తల్లి ఏనుగు.. సాహసమే చేసి నీటికి ఎదురొడ్డి తన తొండంతో పిల్ల ఏనుగును కాపాడుకోగలిగింది. తర్వాత ఆ రెండు కలిసి మందతో కలిసి వెళ్లాయి. వీడియోను ఉత్తర బెంగాల్‌లో గల నగ్రకట సమీపంలో తీశారు. ఆ వీడియోను ఇప్పటికే 32 వేల సార్లు చూశారు. 1836 లైకులు వచ్చాయి. సోషల్ మీడియో వేదికల్లో వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో అదీ వైరల్ అయ్యింది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అంటూ తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)