కారుపై చెట్టు కూలి ఒకరి మృతి

Telugu Lo Computer
0


చెన్నైలో భారీగా వర్షం కురిసింది. 57 ఏళ్ల మహిళ సాయంత్రం తన కారులో ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నక్రమంలో ఆ కారు కేకే నగర్‌ ప్రాంతంలోకి రాగానే నడుస్తున్న కారుపై ఉన్నట్టుండి రోడ్డు పక్కగా ఉన్న ఒక చెట్టు కూలింది. దీంతో డ్రైవింగ్‌ సీటులో ఉన్న 57 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)