తన తండ్రి గురించి ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా !

Telugu Lo Computer
0

 

నెట్టింట అరుదైన విషయాలు పంచుకునే బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్రా రీసెంట్ గా తన తండ్రి గురించి అరుదైన విషయాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. అందులో తన తండ్రి నిర్ణయం ఎంత గొప్పదోనని అభివర్ణిస్తూ బ్రిటీష్ పాలనలో ఉన్నందుకు తన తండ్రి అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. 77 సంవత్సరాల క్రితం ఆనంద్ మహీంద్రా తండ్రి హరీశ్ మహీంద్రా అమెరికా యూనివర్సిటీలో చదువుకునేందుకు పూర్తి చేసిన అప్లికేషన్ అది. అది 1945. టఫ్స్ యూనివర్సిటీకి చెందిన ప్లెచర్ స్కూల్ కు తన తండ్రి అప్లికేషన్ పెట్టుకున్నారట. 'భారతదేశం బ్రిటీష్ వలసరాజ్యంగా ఉన్న సమయంలో మా నాన్నగారి సాహసోపేతమైన ఆకాంక్ష, ధైర్యంగా చేసిన ప్రకటన చదివినందుకు చాలా గర్వంగా ఉంది' అని రాశారు. ఫారిన్ సర్వీస్‌ను వృత్తిపరమైన లక్ష్యంగా తన తండ్రి ఎందుకు ఎంచుకున్నారో సవివరంగా ఉందని వివరించారు. పైగా యువతకు నేను చెప్పే సలహా ఒకటే. మీ పేరెంట్స్ తో ఎక్కువ మాట్లాడండి. ఏం చేయాలనుకుంటున్నారో.. ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి అని డాక్టర్ ఎస్ జయశంకర్ ను ట్యాగ్ చేశారు. తన నాన్న పెట్టుకున్న అప్లికేషన్ కాపీలను తనకు ఫ్లెచర్ స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు అధికారులు ఇచ్చారని, 75ఏళ్ల కాన్ఫిడెన్షియల్ గా ఉంచిన తర్వాతే వాటిని విడుదల చేశారని అందులో రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)