విమాన ప్రయాణికుడికి అత్యవసర వైద్యం చేసిన కేంద్ర మంత్రి !

Telugu Lo Computer
0


ఢిల్లీ - ఔరంగాబాద్ ఎయిరిండియా విమానం మార్గమధ్యలో ఓ ప్యాసింజర్ అస్వస్థకు గురయ్యాడు. అతడి పరిస్థితిని గుర్తించిన ఫ్లైట్ సిబ్బంది నిబంధనల ప్రకారం అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్ ఉంటే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ బీకే.కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే తక్షణమే స్పందించారు. వీరిద్దరూ వైద్యవిధ్యను అభ్యసించడమే కాకుండా వైద్యరంగంలో అనుభవం కూడా ఉంది. దీంతో అనారోగ్యానికి గురయిన సాటి ప్యాసింజర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. చేయి పట్టుకుని నాడి చెక్ చేశారు. ప్రాథమిక చికిత్స అందించడంలో విమాన సిబ్బందికి సూచనలు చేసి అందరినీ మెప్పించారు. ఈ విషయాన్ని ఎయిరిండియా ట్వీటర్ వేదికగా వెల్లడించింది. శనివారం ఈ ఘటన జరిగిందని వివరించింది. నిబంధనల ప్రకారం వైద్యులు ఎవరైనా ఉన్నారా అని ప్రకటన చేశామని, కేంద్ర మంత్రి డాక్టర్ కరాద్, మాజీ మంత్రి డాక్టర్ సుభాస్ భమ్రే స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎయిరిండియా వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)