బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 8 June 2022

బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్


బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెతియా నగరంలో  ఓ బస్సులో స్పృహ కోల్పోయిన స్థితిలో మైనర్ బాలిక కనపడింది. ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి ప్రశ్నించగా.. తనకు బస్సు డ్రైవర్, అతడి ఇద్దరు స్నేహితులు ఓ కూల్ డ్రింక్‌లో మత్తుపదార్థాన్ని కలిపి ఇచ్చారని తెలిపింది. ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత తాను స్మృహ కోల్పోయానని, తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆ మైనర్ బాలిక చెప్పింది. ముగ్గురు వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురిలో డ్రైవర్, హెల్పర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. మరొకరి కోసం గాలిస్తున్నామని వివరించారు. బస్సును సీజ్ చేశామని తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు.

No comments:

Post a Comment