మరో పదేళ్లు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటా !

Telugu Lo Computer
0




మరో పదేళ్ల పాటు క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటానని, ప్రత్యక్షంగా పోటీ చేసేది లేదని రాష్ట్ర బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం యడియూరప్ప వెల్లడించారు. బెంగళూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగుందని, శరీరం సహకరించేంతవరకు పార్టీ కోసం పనిచేస్తానన్నారు. మరో పదేళ్లపాటు క్రియాశీలక రాజకీయాలలోనే ఉంటానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయం ప్రకారం ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ విధానానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో 140-150 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. విజయేంద్ర వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. నాయకుడు అయ్యే అన్ని లక్షణాలు విజయేంద్రలో ఉన్నాయన్నారు. ఇటీవల ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు. తాను ఒంటరి ఎలా అవుతానని, పార్టీలో అంతా సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. పాఠ్యపుస్తకాల రూపంలో ఆర్‌ఎస్ఎస్‌ సాంస్కృతిక భయత్పోదాన్ని కలిగిస్తోందనే సిద్దరామయ్య వ్యాఖ్యలపైనా విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే బడానేత అవుతాననే భ్రమలో సిద్దరామయ్య ఉన్నారన్నారు. కాగా యడియూరప్ప సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించిన మరుసటి రోజే యడియూరప్ప మాట్లాడటం ప్రత్యేకతను సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)