మామిడి పండ్లలో రాణి మాంగో స్టీన్ !

Telugu Lo Computer
0


మాంగో స్టీన్ అనే పండుకు పండ్ల రాణిగా పేరుంది. అంతేకాదు దేవతల ఆహారం గానూ ఖ్యాతి గడించింది. రుచితో ఇది పుల్లగా, తీయగా ఉంటుంది. మ్యాంగోస్టీన్ పండ్లు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా దొరుకుతుంది. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లో మాంగోస్టీన్‌లో పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. థాయ్‌లాండ్ జాతీయ పండు కూడా ఇదే. మ్యాంగో స్టీన్ శాస్త్రీయ నామం గార్సినియా మ్యాంగోస్టానా . మనదేశంలో మ్యాంగోస్టీన్ పండును విభిన్న పేర్లతో పిలుస్తారు. హిందీలో మంగుస్తాన్ అని, మలయాళంలో కటంపి అని, మరాఠీలో కోకుమ్ అని, కన్నడలో హన్ను అని, బెంగాలీలో కావో అని పిలుస్తారు. ఇప్పుడు చాలా మంది చెఫ్‌లు  ఈ పండును అనేక వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. బ్రిటన్ రాణి విక్టోరియాకు కూడా మ్యాంగోస్టీన్ పండు అంటే చాలా ఇష్టం. పండ్లలో రాణిగా పేరున్న మ్యాంగోస్టీన్ పండును అమెరికాలో కొన్నాళ్ల పాటు నిషేధం కూడా విధించారు. ఈ ఆసియన్ పండు ద్వారా దేశంలోకి ఈగలు రావడం ప్రారంభించడంతో పండుపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2007లో ఎత్తివేశారు. మ్యాంగోస్టీన్ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మ్యాంగోస్టీన్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు మహిళల్లో రుతుస్రావ సమస్యలను తగ్గించడంలో కూడా సాయపడుతుంది. మ్యాంగోస్టీన్ పండ్లు మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఐతే మనదేశంలోని కొన్ని నగరాల్లో బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పండును 25 నుంచి 50 వరకు అమ్ముతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)