వెల్లుల్లి - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


సంతానోత్పత్తి సమస్యల ఆయుర్వేద శాస్త్రంలో పలు రకాల మూలికలున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఆహారంలో వెల్లుల్లిని తప్పనిసరిగా తీసుకోవాలని శాస్త్రంలో పేర్కొన్నారు. ఇది శరీరాన్ని దృఢ పరచడమేకాకుండా.. పురుషులలో పలు రకాల లింగ సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రిపూట వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరానికి సంబంధించి వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీనిని రాత్రిపూట తింటే మరింత మేలు జరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)