గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 25 June 2022

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు!


ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ జీవో విడుదల చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని పరీక్ష పాసైన వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. జూలై 1 నుంచి ఈ ఉద్యోగులంతా శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. పే స్కేల్ ప్రకారం వారికి జీతాలు అందనున్నాయి. 2019లో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 1 లక్షా 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో 1.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ రూ.15వేల స్టైఫండ్ ఇచ్చిన ప్రభుత్వం... గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారు కోసం పరీక్షలు నిర్వహించింది. పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు  ప్రకారం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు చేశారు. మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా పేర్కొంది. ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి. ప్రభుత్వం పేర్కొన్న పే స్కేల్లో మూలవేతనానికి అలవెన్సులు కవడంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.30వేల వరకు జీతాలు వచ్చే అవకాశముంది. వీటిలో గ్రామ సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆధారంగా జీతాలు ఎక్కువ వచ్చే అవకాశముంది.


No comments:

Post a Comment