ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని !

Telugu Lo Computer
0


ఆఫీసు పని వేళలు, ఉద్యోగుల క్రమ శిక్షణ, అంకిత భావం, మేనేజ్‌మెంట్‌ ప్రవర్తన తదితర అంశాలపై ఓ నెటిజన్‌ అడిగిన ధర్మసందేహం ట్విటర్‌లో కాక రేపుతోంది. నిమిషానికి వందల సంఖ్యలో నెటిజన్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులకు మద్దతుగా కామెంట్లు చేస్తుండగా కొందరు యాజమాన్యాలకు వత్తాసు పలికారు. అతి కొద్ది మంది సీరియస్‌ మ్యాటర్‌లోనూ కొంటెగా కామెంటారు. గబ్బర్‌ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ నెటిజన్ల ముందు నోటీస్‌ బోర్డులో కనిపించిన దృశ్యాన్ని ఉంచాడు. అందులో 'ఈ రోజు నుంచి మీరు ఆఫీస్‌కి ఒక నిమిషం ఆలస్యం అయితే పది నిమిషాలు అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. ఉదాహారణకు ఉదయం పది గంటలకు రావాల్సిన వాళ్లు 10 గంటల 2 నిమిషాలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వారు అదనంగా 20 నిమిషాలు పని చేసి 6:20 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది' అంటూ మీ ఆఫీసు నోటీస్‌ బోర్డులో ఇలాంటి ఒక ఆర్డర్‌ ఉంటే మీ స్పందన ఏంటీ అంటూ అడిగాడు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)